మరో వారంలో టెట్‌ 2025 హాల్‌ టికెట్లు విడుదల

9249చూసినవారు
మరో వారంలో టెట్‌ 2025 హాల్‌ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP TET October 2025) కోసం 2,58,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ముగిసిన నేపథ్యంలో, విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం కార్యచరణకు సిద్ధమైంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం పాఠశాల విద్యాశాఖ తాజాగా మాక్‌ టెస్టులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. పాస్‌వర్డ్‌ లేకుండానే అభ్యర్థులు ఉచితంగా మాక్‌ పరీక్షలు రాయవచ్చు. డిసెంబర్‌ 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో టెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :