నేటి నుంచి ఏపీలో టెట్ పరీక్షలు

18చూసినవారు
నేటి నుంచి ఏపీలో టెట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (AP TET 2026) ఆగస్టు 5 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. ప్రతిరోజూ రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు, రెండో విడత మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 వరకు జరుగుతుంది. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకపోతే ఆధార్, పాన్ లేదా ఓటరు ఐడీ వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

సంబంధిత పోస్ట్