ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా బ్యాట్‌పై అంపైర్లు ఆంక్షలు విధించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని అతని బ్యాట్‌ను పరీక్షించి, బ్యాటింగ్ చేయడానికి అనుమతించలేదు. దీంతో తెవాటియా మరో బ్యాట్‌తో బ్యాటింగ్ కొనసాగించాడు. సాధారణంగా మైదానంలోకి రాకముందే బ్యాట్‌లను పరీక్షిస్తారు, కానీ ఈ మ్యాచ్‌లో మైదానంలోకి వచ్చిన తర్వాత పరీక్షించడం చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.