ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులను అందించడంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముంబయిలో సమావేశమయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణకు, ఆడ పులుల కొరతతో ఎదురవుతున్న జన్యుపరమైన సమస్యలను అధిగమించడానికి మహారాష్ట్ర సహకారం తీసుకోనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం రెండు ఆడ పులులను ఇవ్వడానికి అంగీకరించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహకారం పులుల సంరక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగు అని, భవిష్యత్తులో ఇరు రాష్ట్రాలు ఉమ్మడి ప్రయోజనాల కోసం మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు.