తూర్పు హిమాల‌యాల వైపు థార్ ఎడారి బ్యాక్టీరియా

1113చూసినవారు
తూర్పు హిమాల‌యాల వైపు థార్ ఎడారి బ్యాక్టీరియా
థార్ ఎడారికి చెందిన బ్యాక్టీరియా తూర్పు హిమాలయాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. ఇసుక తుఫానుల ద్వారా వేల కిలోమీటర్లు ప్రయాణించే ఈ బ్యాక్టీరియా శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతోంది. పశ్చిమ భారత్ నుంచి వచ్చే దుమ్ము తుఫానులు గంగా పరివాహక ప్రాంతాలతో పాటు హిమాలయాలకు కూడా ఎయిర్‌బోర్న్ బ్యాక్టీరియా, ప్యాథోజెన్లను మోసుకెళ్తున్నాయని బోస్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అధ్యయనాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్