AP: విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటులో నీటి సమస్య తలెత్తుతుందనే ప్రచారం అవాస్తవమని
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమలకు వినియోగిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో 23.5 టీఎంసీల నీటి లభ్యత కూడా ఉంటుందన్నారు. నీటి వనరుల నిర్వహణకు తగిన అవకాశాలు ఉన్నాయన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖలో పారిశ్రామిక ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుందన్నారు.