అందుకే నా గడ్డం త్వరగా తెల్లబడుతోంది: నారా లోకేశ్

0చూసినవారు
అందుకే నా గడ్డం త్వరగా తెల్లబడుతోంది: నారా లోకేశ్
AP: తిరుపతి జిల్లా, శ్రీసిటీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన బాస్ చంద్రబాబు నాయుడు చాలా టఫ్ అని, ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల కుర్రాళ్లు, ఏడాది శిశువు ఉన్నారని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకే ఆయనను ఫేస్ చేయాల్సి వస్తుందని, అందుకే తన గడ్డం త్వరగా తెల్లబడుతోందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ భారత ఆర్థిక విప్లవంలో ముందుండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ముఖ్యమంత్రి ఏదైనా చెబితే చేసి చూపిస్తారని లోకేశ్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్