AP: విశాఖపట్నంలోని ఎల్‌వీ నగర్‌లో హత్యకు గురైన యువతి మౌనిక (29) కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కూతురి హత్యపై మౌనిక తండ్రి స్పందించారు. ‘నిందితుడు నా కూతురును ట్రాప్ చేశాడు. నా కూతురుకు డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. నా కూతురు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. ప్రేమ పేరుతో ట్రాప్ చేసి హత్య చేశాడు. నిందితుడిని కఠినంగా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని మౌనిక తండ్రి అన్నారు.