వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడటమే ధ్యేయం: అనిత

8471చూసినవారు
వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడటమే ధ్యేయం: అనిత
AP: వరద ముప్పు నుంచి ప్రజల ప్రాణాలను, వ్యవసాయ భూములను కాపాడటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని హోంమంత్రి అనిత అన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం సోముదేవుపల్లి గ్రామంలో వరహానది రక్షణ గోడ నిర్మాణ పనులకు హోంమంత్రి అనిత శంకుస్థాపన చేశారు. ఎస్‌డీఎంఎఫ్ నిధులు రూ.9.95 కోట్ల వ్యయంతో రక్షణ గోడను నిర్మించనున్నారు. గ్రామాలకు శాశ్వత భద్రత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్