బీసీల రిజర్వేషన్లకు కూటమి కట్టుబడి ఉంది: జీవీ ఆంజనేయులు

0చూసినవారు
AP: బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ చీఫ్ విప్, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు తెలిపారు. గతంలో వైసీపీ అధినేత జగన్ బీసీ కోటాను తగ్గించి ద్రోహం చేశారని, ఇప్పుడు కూడా కోర్టుల ద్వారా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కాగా, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై తక్షణమే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్