స్వరూపానందకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

5078చూసినవారు
స్వరూపానందకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
విశాఖ శారదాపీఠానికి ఏపీ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల స్థలం అనుమతులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థలం విలువ రూ. 220 కోట్లు కాగా.. కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది. కూటమి ప్రభుత్వ వచ్చాక ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.