ఐదేళ్ల పసిపాపను హత్యచేసిన దుండగులు

26035చూసినవారు
ఐదేళ్ల పసిపాపను హత్యచేసిన దుండగులు
TG: నారాయణపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అమ్మిరెడ్డిపల్లిలో తేజశ్రీ(5) అనే బాలిక హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు బాలికను హత్య చేసి, మృతదేహాన్ని ఇంటి సమీపంలోని చెరువు కట్టపై పడేశారు. బాలిక ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలను కూడా అపహరించినట్లు సమాచారం. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్