మరికొద్ది సేపట్లో పెళ్లి.. వరుడు మరీ సన్నగా ఉన్నాడని రిజెక్ట్ చేసిన వధువు

24397చూసినవారు
మరికొద్ది సేపట్లో పెళ్లి.. వరుడు మరీ సన్నగా ఉన్నాడని రిజెక్ట్ చేసిన వధువు
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుక చివరి నిమిషంలో రద్దైంది. పూలమాలలు మార్చుకునే సమయంలో వరుడు, వధువు సోదరుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో వరుడు మరీ సన్నగా ఉన్నాడని, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని వధువు బహిరంగంగా ప్రకటించింది. పెద్దలు, కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా ఆమె నిర్ణయం మార్చుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామ పెద్దలు గంటలపాటు రాజీ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో వరుడి కుటుంబం పెళ్లి రద్దు చేసుకుని వెనుదిరిగింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్