AP: విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసి ఓ మెడికల్ షాప్ యజమాని పరారయ్యాడు. సుజాతనగర్‌కు చెందిన కె. సన్యాసినాయుడు అనే యువకుడు 'యూనివర్సల్ ఫార్మసీ అండ్ డయాగ్నోసిస్ సెంటర్' పేరుతో వ్యాపారం చేస్తూ, నమ్మకం కుదిరించుకున్నాడు. తన వద్దకు వచ్చిన వారికి నెలకు 4% వడ్డీ ఇస్తానని ఆశ చూపించి, స్థానికుల నుండి పొదుపు మొత్తాలను సేకరించాడు. చివరకు చేతికి అందిన కాడికి సర్దుకుని రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసినట్లు పోలీసులు తెలిపారు.