
కుక్క కరిచిన యువకుడు ఎలా మారిపోయాడో చూడండి!
పంజాబ్లోని గురుదాస్పూర్ మెడికల్ సెంటర్లో రేబిస్తో బాధపడుతున్న ఓ యువకుడి వీడియో SM లో వైరల్ అవుతోంది. కొన్ని వారాల క్రితం కుక్క కరిచినప్పటికీ చికిత్స తీసుకోకపోవడంతో ఆ యువకుడికి రేబిస్ సోకింది. ప్రస్తుతం అతడు జ్వరంతో పాటు హైడ్రోఫోబియాతో బాధపడుతూ, నీటిని చూస్తేనే భయపడుతున్నాడు. కుక్క కరిచిన 24 గంటల్లోపే చికిత్స తీసుకోవాలని, లక్షణాలు కనిపిస్తే ప్రాణాపాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.




