దేశంలో టెలివిజన్ రేటింగ్స్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) విడుదల చేసే టెలివిజన్ రేటింగ్స్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ అన్ని ఛానెల్‌ల రేటింగ్స్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. 'టెలివిజన్ రేటింగ్స్ పాలసీ-2026' అమలు నేపథ్యంలో కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రేటింగ్స్ విడుదల చేయవద్దని BARCకు సూచించింది. దీంతో కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు దేశవ్యాప్తంగా అన్ని టీవీ ఛానెల్‌ల రేటింగ్స్ నిలిపివేయబడనున్నాయి.