కేంద్రం ఏపీ పత్తి రైతులను ఆదుకోవాలి: ఎంపీ లావు

28చూసినవారు
కేంద్రం ఏపీ పత్తి రైతులను ఆదుకోవాలి: ఎంపీ లావు
ఏపీలో మోంథా తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో రాష్ట్ర పత్తి రైతుల సమస్యలను ఆయన ప్రస్తావించారు. తుఫాన్ కారణంగా పత్తికి రంగు మారిందని, తేమ శాతం పెరిగిందని ఆయన తెలిపారు. రంగు మారిన, తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తిని కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కొనుగోలు చేసేలా కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని లావు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్