AP: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఘటనపై
వైసీపీ అధినేత
జగన్ తాజాగా స్పందించారు. ‘చిన్నారి అదృశ్యమై 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధులు తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే.. ఇక ప్రజల భద్రతకు ఎలా భరోసా ఇవ్వగలగుతారు’ అని
జగన్ ప్రశ్నించారు.