కూటమి ప్రభుత్వం రైతులను ముంచేసింది: YCP ట్వీట్

9చూసినవారు
AP: వైసీపీ తాజాగా చేసిన సంచలన ట్వీట్‌ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 'మొంథా' తుఫానుతో రైతులు భారీగా నష్టపోయారని ఆరోపించింది. 'భారీ వర్షాలు, ఈదురు గాలులతో సుమారు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. చంద్రబాబు ఈ-క్రాప్‌కు మంగళం పాడి, పంటల బీమాకు ఎసరు పెట్టడంతో ఇప్పుడు రైతులకు పరిహారం అందడం కష్టమే' అని వైసీపీ విమర్శించింది. ప్రకృతి కంటే చంద్రబాబు చేసిన నిర్లక్ష్యంతోనే రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది.

ట్యాగ్స్ :