విజయవాడ పరిసర ప్రాంతాల్లో సంక్రాంతి పండగ సందడి ప్రారంభమైంది. గోదావరి జిల్లాలను తలపించేలా నగర శివారులో కోడి, పొట్టేల పందేల బరులు సిద్ధమవుతున్నాయి. వేలాది మంది వీక్షించేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చట్టవిరుద్ధమైనప్పటికీ, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ పండగ చేసుకోవడం అలవాటుగా మారింది. నిర్వాహకులు టోకెన్లతోనే ప్రవేశం కల్పిస్తూ, శీతల పానీయాలు, భోజనాలు అందిస్తున్నారు.