గ్రామసభ బలపడితేనే దేశం బలపడుతుంది: పవన్ కల్యాణ్

4చూసినవారు
గ్రామసభ బలపడితేనే దేశం బలపడుతుంది: పవన్ కల్యాణ్
AP: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లు, ఇళ్ల వంటి నిర్ణయాలు కార్యాలయాల్లో కాకుండా గ్రామసభల్లో తీసుకోవాలని సూచించారు. గ్రామసభలు బలపడితే సర్పంచ్‌లు బలపడతారని, ఎమ్మెల్యేలు యువత భవిష్యత్తు, అభివృద్ధి వంటి పెద్ద అంశాలపై దృష్టి సారించగలరని అన్నారు. గ్రామపంచాయతీలే ప్రజాస్వామ్యానికి విశ్వవిద్యాలయాలని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజకీయ ప్రస్థానం కూడా గ్రామస్థాయి నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్