అక్కినేని సోదరుల క్రేజీ కాంబో.. పాన్ ఇండియా సినిమా రానుందా?

3210చూసినవారు
అక్కినేని సోదరుల క్రేజీ కాంబో.. పాన్ ఇండియా సినిమా రానుందా?
ఫిల్మ్ నగర్ వర్గాల్లో అక్కినేని నాగ చైతన్య, అఖిల్ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారనే వార్త జోరుగా వినిపిస్తోంది. 'మనం' సినిమాలో అఖిల్ చిన్న పాత్రలో కనిపించినా, పూర్తిస్థాయిలో అన్నదమ్ములు కలిసి నటించలేదు. ఇప్పుడు ఒక బడా నిర్మాణ సంస్థ వీరిద్దరి కోసం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఒక అదిరిపోయే కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వార్తతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున కూడా కీలక పాత్రలో కనిపిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ అఖిల్ కెరీర్‌కు మలుపు తిప్పుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్