AP: విజయవాడలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గత రెండేళ్లలో శాఖ సాధించిన పురోగతి, చేపట్టిన కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకానికి క్రెడిట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని, పథకాలకు పేర్లు మారినా పథకం మారదని అన్నారు. ఆరోగ్యశ్రీపై మాజీ సీఎం
జగన్ అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 108 అంబులెన్స్ సేవల్లో గణనీయమైన మెరుగుదల సాధించామని తెలిపారు.