ఒడి బియ్యం ఎందుకు పోస్తారో తెలుసా?

3011చూసినవారు
ఒడి బియ్యం ఎందుకు పోస్తారో తెలుసా?
మన హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. వాటిలో వివాహిత స్త్రీలకు ఓడి బియ్యం పోయడం ఒకటి. ఇది నేటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆచరిస్తున్నారు. వివాహం సమయంలో, పండుగలకు, కూతురు బిడ్డకు జన్మనిచ్చినప్పుడు పుట్టింటివారు ఓడి బియ్యం పోసి పంపిస్తారు. అల్లుడిని మహావిష్ణువులా భావించి, కూతురిని రక్షించమని కోరడం, ఆడపిల్ల గౌరవానికి సూచికగా దీనిని భావిస్తారు. పుట్టింటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఆడబిడ్డ బియ్యంలో కొంత భాగాన్ని తిరిగి తల్లికి ఇస్తుంది. పండితుల ప్రకారం ఇది నాభి వద్ద ఉండే మణిపుర చక్రంలోని మహాలక్ష్మి శక్తికి బియ్యం సమర్పించడమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్