దేశంలోనే అత్యంత వేగవంతమైన వందే
భారత్ రైలును ఒక పాత డీజిల్ లోకోమోటివ్ లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంకేతిక లోపం, విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు, రైలును తరలించడానికి డీజిల్ ఇంజన్లను రెస్క్యూ ఇంజన్లుగా ఉపయోగిస్తారు. ఈ అరుదైన దృశ్యంపై నెటిజన్లు 'ఓల్డ్ ఈజ్ గోల్డ్', 'ముసలివాళ్ల అనుభవమే రక్షిస్తుంది' అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అత్యున్నత సాంకేతికత కలిగిన రైలును, దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న పాత డీజిల్ ఇంజన్ రక్షించడం ఆసక్తికరంగా మారింది.