AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక పథకం ద్వారా 8,94,745 మంది ప్రజలు లబ్ధి పొందారని, 2.12 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేయబడిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ పథకం రాష్ట్ర ప్రగతికి కొత్త పునాది వేస్తుందని ఆయన పేర్కొన్నారు. సొంత ఇంటి కలలు కంటున్న వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.