ఆలయాల్లో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయాలి: మంత్రి గొట్టిపాటి

40చూసినవారు
ఆలయాల్లో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయాలి: మంత్రి గొట్టిపాటి
AP: పండుగల నేపథ్యంలో అన్ని ఆలయాల్లో విద్యుత్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాల్లో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తుగా తనిఖీలు చేపట్టాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు. భక్తులు, ఆలయ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్