నేటితో విశాఖ ముఖచిత్రం మారిపోబోతుంది: లోకేష్

2387చూసినవారు
నేటితో విశాఖ ముఖచిత్రం మారిపోబోతుంది: లోకేష్
AP: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రూపురేఖలు నేటితో పూర్తిగా మారబోతున్నాయని, ఇప్పటివరకు ఉక్కు నగరంగా గుర్తింపు పొందిన విశాఖ ఇకపై ఏఐ హబ్‌గా ఎదుగుతుందని తెలిపారు. గూగులో పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మైలురాయిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయని చెప్పారు. “ఒకే రాష్ట్రం, ఒకే అభివృద్ధి” అనే లక్ష్యంతో అన్ని ప్రాంతాల్లో సమతుల అభివృద్ధి జరుగుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్