వడోదరలో డబ్ల్యూపీఎల్-2026 చివరి లీగ్ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. ప్లేఆఫ్స్ అవకాశాలను నిర్ణయించే ఈ పోరులో దిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ముంబయి, దిల్లీ 6 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. యూపీ గెలిస్తే ఆ జట్టు కూడా 6 పాయింట్లతో సమానంగా ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ చేరే జట్టు నిర్ణయించబడుతుంది.