అమరావతిలో తప్పులు జరుగుతున్నాయి కాబట్టే ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది: బొత్స

5388చూసినవారు
అమరావతిలో తప్పులు జరుగుతున్నాయి కాబట్టే ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది: బొత్స
AP: రాష్ట్రంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అధికారం చేతుల్లో ఉందనే ధైర్యంతో తమపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలతో పాటు పోలీసులపైనా దాడులు జరిగాయని, ఇది హత్యాయత్నం కిందకు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, ఆటవిక రాజ్యం నడుస్తోందనడానికి ఈ ఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు. అమరావతిలో తప్పులు జరుగుతున్నందునే ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని బొత్స ఆరోపించారు.

సంబంధిత పోస్ట్