పన్నుల పేరుతో ప్రభుత్వం దోచేస్తోంది: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

2చూసినవారు
AP: పన్నుల పేరుతో నెల్లూరు ప్రజలను ప్రభుత్వం దోచేస్తోందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో పన్నుల వసూళ్లను ఒకసారి పరిశీలించాాలి. 2019-20లో రూ.44 కోట్లు వసూలు కాగా.. 2024-25 నాటికి ఆ మొత్తం రూ.77 కోట్లకి చేరింది. 2025-26 నాటికి ఆ మొత్తాన్ని మంత్రి నారాయణ ఏకంగా రూ.111 కోట్లకి చేర్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ వసూళ్ల టార్గెట్‌ను రూ.154 కోట్లకి పెట్టారు. పన్నుల వసూళ్లను పెంచి ప్రజలను దోపిడీ చేస్తున్నారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్