AP: YSR జిల్లా వేముల మండలంలో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటించారు. అక్కడ నేలకొరిగిన అరటి పంటలను పరిశీలించి రైతుల దుస్థితిని తెలుసుకున్నారు.
జగన్ హయాంలో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించేదని, కూటమి వచ్చాక రైతులే కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. గత 14 నెలలుగా రైతుల వద్ద పంటల బీమా ఎలా కట్టించుకున్నారని ప్రశ్నించిన ఎంపీ, ప్రతి రైతుకు ప్రభుత్వమే పంటల బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు.