AP: మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామంలో పెళ్లి పీటల వద్ద వింత ఘటన చోటుచేసుకుంది. ఊరేగింపు సమయంలో డీజే పాటలకు డ్యాన్స్ చేయాలని కొందరు కోరగా, వధువు ఉత్సాహంగా సిద్ధపడింది. అయితే వరుడు మాత్రం డ్యాన్స్ చేయనని చెబుతూ, అందరి ముందే వధువుపై గట్టిగా అరిచాడు. వరుడి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు తండ్రి, అదే క్షణంలో పెళ్లిని రద్దు చేశారు. “ఇలాంటి అహంకారంతో ఉన్న వ్యక్తికి మా కుమార్తెను ఇవ్వలేము” అంటూ వధువును వెంట తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. క్షణాల్లో పెళ్లి రద్దవడంతో ఇరువర్గాల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే చేసిన ఖర్చులు వృథా కావడంతో వరుడి కుటుంబం నిరాశ వ్యక్తం చేసింది.