బలవంతంగా వాంతి చేసుకునే అలవాటు వల్ల గ్యాస్, జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, గొంతు మంట, దగ్గు వంటివి వస్తాయి. కొన్నిసార్లు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ప్రాణాంతక నిమోనియాకు దారితీయవచ్చు. వైద్యులు ఈ అలవాటును వెంటనే మానేయాలని, బ్రష్ చేసేటప్పుడు బలవంతంగా వాంతి చేసుకోకూడదని సూచిస్తున్నారు. నెమ్మదిగా బ్రష్ చేయడం మంచిది. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే, ఆరోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించాలి.