AP: CM చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రూ.289.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.38.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. కుప్పం క్రమంగా 'స్వర్ణ కుప్పం'గా మారుతోందని, వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కుప్పం ప్రజలతో తనకు కుటుంబ అనుబంధం ఉందని, 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఆదరిస్తున్నారని, కుప్పం అభివృద్ధికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.