కుటుంబ బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్లు, హార్మోన్ల మార్పుల వల్ల మహిళలు ఒంటరితనం, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో మహిళల ఆత్మహత్యల్లో 15-34 ఏళ్లలోపు వారు 63% ఉన్నారు. చాలామందికి సరైన చికిత్స అందడం లేదు. మహిళలు తమ సమస్యలను చెప్పుకోలేకపోవడం, సాధికారత లోపించడం వంటివి దీనికి కారణాలని నిపుణులు అంటున్నారు. వ్యక్తిగత ఆసక్తులు, కొత్త పరిచయాలు, భావాలను పంచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు.