AP: విశాఖలోని గాజువాకలో ప్రియురాలు మౌనికను నేవీ ఉద్యోగి రవీంద్ర ఇంటికి పిలిచి హత్య చేసి శరీర భాగాలను ముక్కులుగా కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫ్రిడ్జ్‌లో రెండు మూటల్లో ఉన్న శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మౌనిక తల కనిపించకపోవడంతో పోలీసులు ఆరా తీయగా.. రవీంద్ర ఆమె తల, కాళ్లు, చెప్పులు, సిమ్ కార్డును సూట్ కేసులో ఉంచి ధారపాలెంలో పడేసినట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు మౌనిక తలను గుర్తించినట్లు తెలుస్తోంది.