ప్రియురాలిని ముక్కలు చేసిన ఘటన.. వెలుగులోకి నిజాలు

5421చూసినవారు
ప్రియురాలిని ముక్కలు చేసిన ఘటన.. వెలుగులోకి నిజాలు
AP: విశాఖపట్నంలోని గాజువాకలో నేవీ ఉద్యోగి రవీంద్ర తన ప్రియురాలు మౌనికను హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవీంద్రకు మౌనికతో మూడేళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల రవీంద్ర మరో యువతిని వివాహం చేసుకున్నాడు. తనను కూడా పెళ్లి చేసుకోవాలని మౌనిక కొద్దిరోజులుగా రవీంద్రను ఒత్తిడి చేస్తోంది. ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి రవీంద్ర ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడు. ఆమెను చంపిన తర్వాత శ్రీకాకుళంలో ఉన్న స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్