కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ' మూవీకి భారీ ఎదురుదెబ్బ

15425చూసినవారు
కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ' మూవీకి భారీ ఎదురుదెబ్బ
కాజల్ అగర్వాల్ నటించిన 'ది ఇండియా స్టోరీ' చిత్రం హిందీలో విడుదలైంది. వ్యవసాయంలో పురుగుమందుల వాడకం, వాటిలోని రసాయనాలు, అవినీతి వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రతికూల సమీక్షలను అందుకుంది. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ. 16 లక్షలు, రెండో రోజు రూ. 25 లక్షలు వసూలు చేసింది. మొత్తం రూ. 46 లక్షలు మాత్రమే రాబట్టడంతో నిర్మాతలకు నిరాశ కలిగింది. ఈ సినిమా కాజల్ కెరీర్‌కు కూడా ఎదురుదెబ్బగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్