TG: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి, ప్రజలకు 300 ఎకరాల భూమిని రాసిచ్చి, సొంత ఇల్లు కూడా లేకుండానే మంగళవారం హైదరాబాద్‌లో కుమార్తె ఇంట్లో తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అద్దె ఇంట్లోనే ఉంటూ, సాధారణ చెతక్ బండిపైనే తిరిగిన ఆయన, భూదాన్ రెడ్డిగా పేరొందారు. 1978, 1983లలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నర్సింహారెడ్డి, తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. బీబీనగర్ నిమ్స్ కోసం ఆమరణ దీక్ష కూడా చేశారు. ఆయన అంత్యక్రియలు బుధవారం స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో జరగనున్నాయి.