TG: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. సమీప అడవుల్లోని కొండలు, వాగులు పొంగడంతో జలపాతానికి భారీగా వరద నీరు చేరుతోంది. నీరు ఎత్తైన కొండల నుంచి పాల నూరగ మాదిరి కిందికి జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. 'తెలంగాణ నయాగరా'గా పేరొందిన బొగత జలపాత సోయగాలను తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.