2018లో అమెరికాలో ఎండిపోయిన ప్రైజ్ నది వద్ద 100 బీవర్లను వదిలిన ప్రయోగం విజయవంతమైంది. ఈ బీవర్లు (దంతాల ఎలుకలు) 100కి పైగా చిన్న డ్యాంలు నిర్మించాయి. దీంతో ఎండిపోయిన నది ఏడాదంతా ప్రవహించడం ప్రారంభించింది. భూగర్భ జలాలు పెరిగి, పరిసరాలు పచ్చబడ్డాయి. ఈ ప్రకృతి ఆధారిత పరిష్కారం నుంచి భారత్ కూడా నేర్చుకోవాలని, నదులను కాపాడేందుకు బీవర్ల వంటి ప్రకృతి ఇంజనీర్లను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. బీవర్లు నీటి ప్రవహానికి అడ్డుగా కట్టెలు, చిన్న పుల్లలను అడ్డుగా చేర్చి నీటి ప్రవహాన్ని ఆపుతాయి.