పేదరికం లేని మూడు సంపన్న దేశాలు ఇవే!

8167చూసినవారు
పేదరికం లేని మూడు సంపన్న దేశాలు ఇవే!
ప్రపంచవ్యాప్తంగా పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నప్పటికీ మొనాకో, లక్సంబర్గ్, లీచ్టెన్‌స్టెయిన్ వంటి చిన్న దేశాలు సమర్థవంతమైన పాలనతో పేదరికం లేని దేశాలుగా నిలిచాయి. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం, అత్యున్నత జీవన ప్రమాణాలు అందించడం దీనికి కారణాలు. మొనాకోలో ప్రతి ముగ్గురిలో ఒకరు మిలియనీర్ కాగా, లక్సంబర్గ్ అత్యధిక వేతనాలు, ఉచిత ప్రజా రవాణాను అందిస్తోంది. లీచ్టెన్‌స్టెయిన్‌లో నిరుద్యోగం దాదాపు శూన్యం. ఈ దేశాల విధానాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్