పవన్ కల్యాణ్ 'పల్లెపండుగ 2.0'కు ముహూర్తం ఖరారు

5432చూసినవారు
పవన్ కల్యాణ్ 'పల్లెపండుగ 2.0'కు ముహూర్తం ఖరారు
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'పల్లెపండుగ 2.0' కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. గత ఏడాది విజయవంతమైన ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్ కనెక్షన్లు, మరుగుదొడ్లు, పశువుల కొట్టాలు వంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈసారి కూడా గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు సూచించారు. వచ్చే నెల చివర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :