కొల్లేరులో వలస పక్షుల సందడి.. 98కి చేరిన రామసర్ సైట్స్!

4760చూసినవారు
కొల్లేరులో వలస పక్షుల సందడి.. 98కి చేరిన రామసర్ సైట్స్!
వలస పక్షులకు స్వర్గధామాలైన చిత్తడి నేలలు జీవవైవిధ్య కేంద్రాలుగా పనిచేస్తాయి. భూగర్భ జలాల పెరుగుదల, మత్స్య సంపద వృద్ధి, వరదల నియంత్రణ వంటి ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, నగరీకరణ, వ్యవసాయం, కాలుష్యం వంటి సమస్యల వల్ల వీటి మనుగడ ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో, చిత్తడి నేలల పరిరక్షణ, పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. రామ్సర్ సైట్ అనేది అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఆర్ద్రభూమి, దీనిని 1971లో ఇరాన్‌లోని రామ్సర్ నగరంలో జరిగిన ఒప్పందం ఆధారంగా గుర్తిస్తారు.

సంబంధిత పోస్ట్