జనసేనలో చిచ్చు పెట్టిన నామినేటెడ్ పదవి!

28994చూసినవారు
జనసేనలో చిచ్చు పెట్టిన నామినేటెడ్ పదవి!
AP: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను విడతల వారీగా భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జనసేన పార్టీలో ఓ నామినేటెడ్ పదవి చిచ్చు రేపింది. శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ ఎంపిక వ్యవహారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తలనొప్పిగా మారింది. ఆలయ ఛైర్మన్‌గా కొట్టే సాయి ప్రసాద్‌ను నియమించడంపై శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జ్ కోట వినూత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని వినూత లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్