కోటి సంతకాల ఉద్యమం విజయవంతం: జగన్

23చూసినవారు
AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రారంభించిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం విజయవంతమైందని వైఎస్ జగన్ తెలిపారు. సోమవారం ఎక్స్‌ వేదికగా.. ‘అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు. వీటిని ఈ నెల 18న గవర్నర్‌కు సమర్పిస్తాం. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజారోగ్య వ్యవస్థను, వైద్య విద్యను దోచుకునే ఈ దోపిడీకి వెంటనే తెరపడాలి’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్