AP: పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీతో పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుందని
టీడీపీ పేర్కొంది. పేదల పిల్లలు డాక్టర్ కావాలంటే ఫ్రీ సీట్లు (కన్వీనర్ కోటా) పెరుగుతాయని తెలిపింది. పాత విధానంలో 5 కాలేజీల్లో ఫ్రీ సీట్లు 213 (42.5%) ఉంటే.. పీపీపీ మోడల్ 17 కాలేజీల్లో ఫ్రీ సీట్లు 850 (50%) పెరుగుతాయని వెల్లడించింది. పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీలను కడితే పేదలకు అన్యాయం జరుగుతుందని
వైసీపీ తప్పుదారి పట్టిస్తోందని మండిపడింది.