AP: జగన్ నియంత అని, గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. అవమానాలు ఎదురైనా కూటమి కొనసాగుతుందన్నారు. ముందుచూపు ఉన్న సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన వాళ్లతో పవన్‌ను రెచ్చగొట్టాలని వైసీపీ చూస్తోందని మండిపడ్డారు.