AP: VRO, VRA, సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నేతలతో త్వరలో సమావేశం నిర్వహిస్తానని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ రవీంద్రరాజు నేతృత్వంలో సంఘాల నాయకులు సచివాలయంలో మంత్రిని కలిసి ప్రమోషన్లు, పేస్కేల్, DA, అలవెన్సుల సమస్యలను విన్నవించారు. వారి డిమాండ్లపై త్వరలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.